Black Fungus: గాంధీ ఆసుపత్రిలో మరో బ్లాక్ ఫంగస్ రోగి మృతి
- మహబూబ్ నగర్ జిల్లా వాసి ఫంగస్ తో మృతి
- ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న మృతుడు
- కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఫంగస్ బారిన పడిన వైనం
తెలంగాణలో బ్లాక్ ఫంగస్ ప్రభావం నెమ్మదిగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు వ్యక్తులు ఫంగస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో మరో బ్లాక్ ఫంగస్ పేషెంట్ మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామస్తుడు వెంకట్ రెడ్డి (46) ఫంగస్ కారణంగా చనిపోయాడు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నాడు. అయితే ఆ తర్వాత కంటి ఇన్ఫెక్షన్ కు గురయ్యాడు.
ఇన్ఫెక్షన్ కు గురైన ఆయనను కుటుంబసభ్యులు జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయనకు బ్లాక్ ఫంగస్ సోకినట్టు నిర్ధారించారు. అనంతరం ఆయనకు అక్కడ చికిత్స అందిస్తుండగా... ఆయన పరిస్థితి విషమించింది. దీంతో, ఆయనను హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ ఆయన ఈ ఉదయం మృతి చెందారు.