Keerthi Suresh: పెళ్లి వార్తలపై స్పందించిన కీర్తి సురేశ్!

 Keerthi Suresh gave a clarity on her marriege rumours
  • నా పెళ్లి గురించిన వార్తల్లో నిజం లేదు
  • ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు
  • కెరియర్ పైనే పూర్తి దృష్టి
  • పెళ్లి కుదిరితే నేనే చెబుతాను    
కీర్తి సురేశ్ కి తెలుగు ... తమిళ భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ రెండు భాషల్లో ఏక కాలంలో ఆమె స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేస్తోంది. తెలుగులో మహేశ్ బాబు సరసన నాయికగా ఆమె 'సర్కారువారి పాట' చేస్తోంది. అలాగే తమిళ సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పెళ్లి వార్త ఒకటి కొన్ని రోజులుగా జోరుగా షికారు చేస్తోంది. చెన్నైకి చెందిన ఒక వ్యాపార వేత్తతో ఆమె వివాహం జరగనుందనే ప్రచారం జరుగుతోంది.

పెళ్లి వార్తలు హీరోయిన్ల కెరియర్ పై వెంటనే ప్రభావం చూపుతూ ఉంటాయి. అందువలన వెంటనే వారు ఈ విషయంపై స్పందిస్తూ ఉంటారు. అలాగే కీర్తి సురేశ్ కూడా వెంటనే రంగంలోకి దిగిపోయింది. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పింది. ఇప్పట్లో అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. తన దృష్టి అంతా కూడా సినిమాలపైనే ఉందనీ, కెరియర్ పైనే శ్రద్ధ పెడుతున్నానని అంది. ఎప్పుడు తన పెళ్లి ఖాయమైనా ఆ విషయాన్ని తానే ముందుగా చెబుతానని ఒక క్లారిటీ ఇచ్చేసింది.
Keerthi Suresh
Mahesh Babu
Parashuram

More Telugu News