: బాబోయ్.. రోహిణి కార్తె వచ్చేసింది!
మండు వేసవిని మరింత మండించేలా రోహిణి కార్తె ప్రవేశించింది. దీంతో, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత హెచ్చే అవకాశం ఉందంటున్నారు. అది నిజమే అనిపించేలా, ఈ ఉదయం పదింటికే రాష్ట్రంలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి భయాందోళనలు కలిగిస్తున్నాయి. విజయవాడలో రికార్డు స్థాయిలో 47 డిగ్రీలు నమోదు కాగా, హైదరాబాద్ లో 42, కాకినాడలో 46, నెల్లూరులో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కాగా, రాష్ట్ర ప్రజలు మరో రెండ్రోజుల పాటు భానుడి ప్రతాపాన్ని చవిచూడక తప్పదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్లుండి వరకు ఎండ వేడిమి ఇలాగే కొనసాగుతుందని వారు ప్రకటించారు.