Raghunath Mahapatra: ఒడిశా ఎంపీతో పాటు ఆయన ఇద్దరు కుమారులను బలిగొన్న కరోనా

MP Raghunath Mahapatra and his sons dies of corona
  • ఇటీవల ఎంపీ రఘునాథ్ మహాపాత్ర కన్నుమూత
  • కరోనాకు చికిత్స పొందుతూ మృతి
  • నిన్న మృతి చెందిన చిన్న కుమారుడు
  • నేడు పెద్ద కుమారుడు కన్నుమూత
కరోనా మహమ్మారి ధాటికి అనేక మంది రాజకీయ నేతలు కూడా బలైపోతున్న సంగతి తెలిసిందే. ఒడిశాకు చెందిన రాజ్యసభ సభ్యుడు రఘునాథ్ మహాపాత్ర (78) కూడా కరోనాతో ప్రాణాలు విడిచారు. మరింత విషాదం ఏమిటంటే ఆయన ఇద్దరు కుమారులు కూడా కొన్నిరోజుల వ్యవధిలోనే కన్నుమూశారు. మహాపాత్ర ఈ నెల 9న మరణించారు. గత నెల 22న ఒడిశాలోని భువనేశ్వర్ లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన మరిక కోలుకోలేకపోయారు.

ఆ తర్వాత మహాపాత్ర కుమారులు జశోబంత, ప్రశాంత కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. వీరిద్దరినీ ఎయిమ్స్ కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. ప్రశాంత నిన్న కన్నుమూయగా, పెద్దవాడైన జశోబంత నేడు తుదిశ్వాస విడిచాడు.

రఘునాథ్ మహాపాత్ర గొప్ప శిల్పిగా ఖ్యాతి పొందారు. ఆయనకు కేంద్రం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. ఇక, ఆయన కుమారుడు ప్రశాంత ఒడిశా రంజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా వ్యవహరించారు. కొన్నిరోజుల వ్యవధిలోనే ఆయన, ఇద్దరు కుమారుల మరణంతో ఒడిశా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Raghunath Mahapatra
Jashobantha
Prashantha
Deaths
Corona
Odisha

More Telugu News