Swaroopanandendra Saraswati: జగన్ కు అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి: స్వరూపానందేంద్ర

Swaroopanandedra appreciates AP govt budget
  • రాష్ట్ర బడ్జెట్ అత్యద్భుతంగా ఉంది
  • అర్చకులకు 120 కోట్లు కేటాయించడం హర్షణీయం
  • నేను ప్రస్తుతం రిషికేశ్ లో ఉన్నా
ఏపీ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ పై అందరికంటే ముందుగా విశాఖ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. అర్చకుల జీతాల కోసం రూ. 120 కోట్లు కేటాయించడం హర్షణీయాంశమని అన్నారు.

అర్చకుల వేతనాల గురించి గత పాలకులు ఎవరూ పట్టించుకోలేదని.. జీతాలను పెంచి వారి జీవితాల్లో జగన్ వెలుగులు నింపారని ప్రశంసించారు. ప్రస్తుతం తాను రిషికేశ్ లో ఉన్నానని... బడ్జెట్ కేటాయింపుల గురించి విని చాలా సంతోషించానని చెప్పారు. జగన్ రెడ్డికి రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయని అన్నారు.
Swaroopanandendra Saraswati
Vizag
Jagan

More Telugu News