Jagan: ప్రాణం విలువ నాకు బాగా తెలుసు: సీఎం జగన్

CM Jagan says he knows well the value of human life
  • నేడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం
  • ప్రసంగించిన సీఎం జగన్
  • ప్రాణం విలువ తెలుసు కాబట్టే ఆరోగ్యశ్రీ తెచ్చామని వెల్లడి
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ముగింపుగా ఆయన మాట్లాడుతూ, తమ పాలన చేపట్టిన తర్వాత సగర్వంగా మాట్లాడుతున్నామని సీఎం జగన్ ప్రసంగం ప్రారంభించారు. ఆపై కొవిడ్ బాధితులకు నివాళిగా కొన్ని నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.

"ప్రాణం విలువ నాకు తెలుసు అధ్యక్షా. దివంగత మహానేత వైఎస్సార్ చనిపోయిన సమయంలో ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిసి వారి కోసం ఏ రాజకీయ నేత చేయని విధంగా ఓదార్పు యాత్ర చేశాను. వారికి తోడుగా ఉండాలని నిర్ణయించుకుని ప్రతి కుటుంబాన్ని పరామర్శించాను. ప్రాణం విలువ తెలుసు కాబట్టే, ఆరోగ్యశ్రీని సమూలంగా మార్పులు చేశాం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి రావాలని, ఆరోగ్యశ్రీ నామమాత్రంగా ఉండకుండా, ప్రాణంపోసే పథకంలా ఉండాలని ఆకాంక్షించాం.

రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నాం. మేం అధికారంలోకి రాకముందు ఆరోగ్యశ్రీలో 1000 చికిత్సలకే అనుమతి ఉంది. మేం వచ్చాక 2,400 జబ్బులకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. 1180 అంబులెన్స్ వాహనాలు కొనుగోలు చేసి ప్రతి మండలానికి చేరవేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చాం. వైఎస్సార్ విలేజ్ క్లినిక్కులు తీసుకువస్తున్నాం. 90 రకాల రుగ్మతలకు అక్కడ ఔషధాలు లభిస్తాయి" అని వివరించారు.
Jagan
Life
AP Assembly Session
Budget Session
YSRCP
Andhra Pradesh

More Telugu News