Jr NTR: ఇద్దరు బలవంతులు జట్టుకడితే.. ఎన్టీఆర్​ 31 ఖరారు!

Prashanth Neil and Jr NTR Join Hands For Massive Movie
  • కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా
  • ప్రకటించిన మైత్రి మూవీ మేకర్స్
  • ఆర్ఆర్ఆర్ తో బిజీగా తారక్
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. కుమురం  భీంగా తన పవరేంటో చూపించేందుకు సిద్ధమైపోతున్నాడు. ఇవ్వాళ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా యూనిట్ శక్తిమంతమైన పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ సినిమాతో పాటు 'కేజీఎఫ్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ తోనూ మరో సినిమా చేయనున్నాడు తారక్. ఎప్పటి నుంచో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆ ఊహాగానాలకు తెరదించుతూ.. ఎన్టీఆర్ 31వ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ఉంటుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. మరచిపోలేని ప్రయాణంలో ఇద్దరు బలవంతులు జత కలిశారంటూ ట్వీట్ చేసింది. ఇది భారీ చిత్రమని ప్రకటించింది.


ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమాను చేయనున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కనుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
Jr NTR
RRR
Prashanth Neil
KGF

More Telugu News