కేసీఆర్ ను చూసైనా జగన్ తాడేపల్లి రాజప్రాసాదం వదిలి బయటికి రావాలి: కొల్లు రవీంద్ర
- గాంధీ ఆసుపత్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్
- కరోనా రోగులకు చికిత్స, సౌకర్యాలపై పరిశీలన
- జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కున్నాడన్న కొల్లు
- కేసీఆర్ ను చూసి జగన్ సిగ్గు తెచ్చుకోవాలని వ్యాఖ్యలు
ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ తాడేపల్లి రాజప్రాసాదం వదిలి బయటికి రావాలని, వాస్తవ పరిస్థితులు తెలుసుకుని ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు.