Rakhi Sawant: చాలా అప్సెట్ అయ్యాను: రాఖీ సావంత్

Rakhi Sawants roof collapses due to Cyclone Tauktae
  • ముంబైపై తీవ్ర ప్రభావం చూపిన తౌతే తుపాను
  • భారీ వృక్షాలు, కరెంట్ పోల్స్ కూలిన పరిస్థితి
  • కూలిన రాఖీ సావంత్ ఇంటి బాల్కనీ రూఫ్ టాప్
తౌతే తుపాను పలు రాష్ట్రాలపై విరుచుకుపడింది. ఈ తుపాను ధాటికి ముంబై నగరం కూడా విలవిల్లాడింది. పెద్ద సంఖ్యలో భారీ వృక్షాలు, కరెంటు పోల్స్ కుప్పకూలిపోయాయి. రోడ్లు, పలు భవనాలు ధ్వంసమయ్యాయి. తుపాను వల్ల నష్టపోయిన బాధితుల్లో బాలీవుడ్ శృంగార నటి రాఖీ సావంత్ కూడా ఉంది.

లోఖండ్ వాలాలో రాఖీ సావంత్ కొత్తగా నిర్మించుకున్న ఇంటి బాల్కనీ రూఫ్ టాప్ భారీ వర్షాల కారణంగా కూలిపోయింది. ఈ నేపథ్యంలో రాఖీ సావంత్ మాట్లాడుతూ, ఈ ఘటనతో తాను చాలా అప్సెట్ అయ్యానని చెప్పింది. మరోవైపు తుపాను నేపథ్యంలో బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, కరీనా కపూర్, కార్తీక్ ఆర్యన్ తదితరులు నగర ప్రజలను హెచ్చరించారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని కోరారు.
Rakhi Sawant
House
Bollywood
Tauktae Cyclone

More Telugu News