Vijayasai Reddy: ప్రతి దుర్మార్గానికి శిక్ష పడక తప్పదు బాబూ: విజయసాయిరెడ్డి

Vijayasai reddy comments on Chandrababu
  • ముద్దాయికంటే చంద్రబాబే ఎక్కువ ఆందోళన చెందుతున్నాడు
  • మత్తు డాక్టర్ కు మించిన గమ్మత్తు చేస్తున్నావ్ రాజా
  • టీడీపీ స్క్రిప్టు ప్రకారమే డ్రామా రక్తి కట్టించారు
రఘురామకృష్ణరాజు అరెస్ట్ ఎపిసోడ్ లో ఆయన కంటే టీడీపీ అధినేత చంద్రబాబే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. నిందితుడితో పాటు ఆయనను ప్రోత్సహించిన వారిని కూడా పీనల్ కోడ్ శిక్షార్హులుగా గుర్తిస్తుందని అన్నారు. భారీ కుట్ర చేసేందుకు స్కెచ్ వేసి బొక్కబోర్లా పడ్డాడని ఎద్దేవా చేశారు. 'కొంచెం ఆలస్యం కావచ్చు కానీ... ప్రతి దుర్మార్గానికి శిక్ష పడక తప్పదు బాబూ' అని వ్యాఖ్యానించారు.

'విశాఖలో రోడ్డుపై చొక్కా చించుకుని పోలీసులను తిట్టిన మత్తు డాక్టర్ కు మించిన గమ్మత్తు చేస్తున్నావ్ రాజా' అంటూ విజయసాయి అన్నారు. ఇద్దర్నీ ప్రయోగించింది పచ్చ పార్టీయేనని ఈ నటన చూస్తే తెలియడం లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ స్క్రిప్టు ప్రకారమే డ్రామా రక్తికట్టించారని తేలిపోయిందని చెప్పారు. రమేష్ హాస్పిటల్ ఇప్పుడు రమేష్ హోటల్ అయిందని ఎద్దేవా చేశారు.
Vijayasai Reddy
YSRCP
Raghu Rama Krishna Raju
Chandrababu
Telugudesam

More Telugu News