కరోనా సమయంలో మత రాజకీయాలు మానుకోవాలి: కన్నాకు గుంటూరు మేయర్ హితవు
- ఆలయాల్లో కొవిడ్ సెంటర్లు
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కన్నా
- కన్నాను తప్పుబట్టిన గుంటూరు మేయర్ మనోహర్
- సిబ్బంది కోసమే కొవిడ్ కేంద్రాల ఏర్పాటు అని వివరణ
ఉద్యోగులు, సిబ్బంది కోసమే ఆలయాల కాటేజీలు, సత్రాల్లో కొవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని మనోహర్ వెల్లడించారు. కన్నా లక్ష్మీనారాయణ మత విద్వేషాలు రెచ్చగొట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కరోనా సమయంలో కన్నా మత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.