సోనూ సూద్ పేరిట నకిలీ ఫౌండేషన్.. విరాళాల సేకరణ.. ప్రజలను అప్రమత్తం చేసిన సోనూసూద్!
- కరోనా సమయంలో ఆపద్బాంధవుడిగా నిలిచిన సోనూ సూద్
- సోనూ పేరుతో దోచుకునేందుకు బయల్దేరిన కేటుగాళ్లు
- అలాంటి వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న సోను
తాజాగా సోనూ సూద్ ఫౌండేషన్ పేరుతో సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. దేశ ప్రజలకు తాము చేస్తున్న సహాయ, సహకారాలకు అందరూ సహకరించాలని, తోచిన మేరకు విరాళాలు ఇవ్వాలని కేటుగాళ్లు కోరుతున్నారు. దీంతో, ఎంతో మంది సోను మీద అభిమానంతో వారికి తోచిన విరాళాలు పంపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సోను... అందరినీ అప్రమత్తం చేశారు. కేటుగాళ్లు షేర్ చేస్తున్న స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ... ఆ సంస్థకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇలాంటి వాళ్ల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.