YS Sharmila: సీఎం పదవిని కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే: కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

Bring CM post also under contract basis says YS Sharmila
  • కాంట్రాక్టు పద్ధతిపై వైద్య సిబ్బందిని నియమించాలనుకుంటున్నారు
  • అర్హత సాధించిన 658 మంది నర్సులకు ఇంకా ఉద్యోగాలు కల్పించలేదు
  • వారిని పర్మినెంట్ గా ఉద్యోగాల్లోకి తీసుకోవాలి
తెలంగాణ ముఖ్యమంత్రిపై వైయస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సారుకు కాంట్రాక్టు ఉద్యోగాలే ముద్దుగా ఉన్నాయని విమర్శించారు. సీఎం పదవిని కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే అని ఎద్దేవా చేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ కాంట్రాక్టుపై వైద్య సిబ్బందిని నియమించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించుకుందని అన్నారు.

2017లో 3,311 స్టాఫ్ నర్సులకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ సర్కారు... అర్హత సాధించిన ఇంకా 658 మందికి మాత్రం ఉద్యోగాలు కల్పించలేదని షర్మిల దుయ్యబట్టారు. ఇప్పుడు కాంట్రాక్టు పద్ధతిన నర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలనుకుంటున్న ప్రభుత్వం... ముందు అర్హత సాధించిన 658 మందిని పర్మినెంట్ గా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి తోడు 'తాత్కాలిక పోస్టులకే పిలుపు' అంటూ ఓ వార్తాపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని ఆమె షేర్ చేశారు.
YS Sharmila
KCR
TRS
Nurses
Contract Employees

More Telugu News