Reliance: కొవిడ్ సహాయ చర్యల్లో పాల్గొనే ఏపీ, తెలంగాణ వాహనాలకు ఉచిత ఇంధనం: రిలయన్స్

Reliance Industries Giving free petrol for covid vehicles in ap and telangana
  • సంబంధిత అధికారుల నుంచి అనుమతి పత్రం ఉన్న వాహనాలకు మాత్రమే
  • రోజుకు గరిష్ఠంగా 50 లీటర్ల ఇంధనం
  • జూన్ 30 వరకు అందుబాటు
కరోనా మహమ్మారితో పోరాడుతున్న తెలుగు రాష్ట్రాలకు తన వంతు సాయం అందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న అత్యవసర వాహనాలు అంబులెన్స్‌లకు రిలయన్స్ పెట్రోలు బంకుల ద్వారా ఉచిత ఇంధనాన్ని అందించనున్నట్టు తెలిపింది.

 కొవిడ్ కార్యకలాపాల్లో ఉన్నట్టు సంబంధిత అధికారులు జారీ చేసిన లేఖ ఉన్న వాహనాలకు రోజుకు గరిష్ఠంగా 50 లీటర్ల ఇంధనాన్ని ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. జూన్ 30 వరకు ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. అలాగే, ఇప్పటికే ఉభయ రాష్ట్రాలకు చెరో 80 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను అందించినట్టు రిలయన్స్ వివరించింది.
Reliance
Andhra Pradesh
Telangana
Covid Vehciles
Petrol

More Telugu News