టెలివిజన్ నటికి ప్రొఫెసర్ నుంచి అసభ్య సందేశాలు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటున్న నటి!

Television actress and singer Soundarya exposes a college professor who sent obscene texts to her
  • చాటింగును బయటపెట్టిన నటి సౌందర్య
  • అతడు పనిచేస్తున్న కాలేజీలోని అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
  • ఇలాంటి వారిని ఊరికే వదలబోనన్న నటి
‘నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నా కోరిక తీరిస్తే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా’ అంటూ ఓ కాలేజీ ప్రొఫెసర్ కోలీవుడ్ బుల్లితెర నటి, సూపర్ సింగర్ ఫేం సౌందర్య బాలనందకుమార్‌కు ప్రపోజ్ చేశాడు. ప్రొఫెసర్ స్థానంలో ఉండి అసభ్యకరంగా ఆయన చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్‌ను బయటపెట్టిన సౌందర్య..  ఇలాంటి వెధవలను ఏం చేయాలని ప్రశ్నించింది. అతడు కచ్చితంగా ఇందుకు మూల్యం చెల్లించుకుంటాడని హెచ్చరించింది. అతడు పనిచేస్తున్న కాలేజలోని అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సౌందర్య హెచ్చరించింది.

ఒక మహిళతో ప్రొఫెసర్ మాట్లాడే విధానం ఇదేనా? సిగ్గుచేటు అని సౌందర్య ఆవేదన వ్యక్తం చేసింది. అతడి ప్రొఫైల్‌ను బట్టి మధురైకి చెందినట్టుగా తెలుస్తోందని, అతడు పనిచేస్తున్న కాలేజీలోని అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అతడి గురించి వివరాలు రాబడుతున్నానని, అన్ని వివరాలు లభించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది. అతడు పనిచేస్తున్న కాలేజీ గురించి కూడా తెలుసుకుని యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తానని పేర్కొంది. ఇలాంటి వారిని ఊరికే వదిలేయకూడదని హెచ్చరించింది.

వర్థమాన నటి అయిన సౌందర్య ఓ వైపు సీరియళ్లలో నటిస్తూనే సినిమాల్లోనూ బిజీగా మారింది. రజనీకాంత్ నటించిన ‘కబాలి’, విజయ్ ‘మాస్టర్’  సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది.
Go Back to Shorts
Television actress
Super Singer
Soundarya

More Telugu News