తిరుపతిలో యాచకుడి ఇంట్లో రూ.10 లక్షలు... ఆశ్చర్యపోయిన అధికారులు!
- తిరుమల కొండపై భిక్షాటన చేసుకునే శ్రీనివాసాచారి
- నిర్వాసితుడిగా భావించి తిరుపతిలో ఇల్లు కేటాయింపు
- ఏడాది కిందట మృతిచెందిన శ్రీనివాసాచారి
- వారసులు లేకపోవడంతో ఇంటిని స్వాధీనం చేసుకున్న టీటీడీ
- ఇంట్లో రెండు పెట్టెల నిండా డబ్బు
అయితే, శ్రీనివాసాచారి కరోనాతో గతేడాది మరణించాడు. అతడికి నా అన్నవాళ్లెవరూ లేకపోవడంతో శేషాచల నగర్ లోని అతడి నివాసాన్ని టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించిన టీటీడీ అధికారులు విస్మయానికి గురయ్యారు. రెండు పెట్టెలు తెరిచి చూడగా, అందులో కరెన్సీ కట్టలు కనిపించాయి. వాటి విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.