మద్యం తాగలేదు.. మంచినీళ్లు తాగాను: సినీ నటి ధన్య
- 'రాజారాణి' సినిమాలో సీన్‌పై వివరణ
- తాను ఎక్కువగా పార్టీలు చేసుకోనన్న ధన్య
- వీకెండ్లలో తన స్నేహితుల్ని కలుస్తానని వ్యాఖ్య
- లాంగ్ డ్రైవ్స్ లేదా కాఫీ తాగడానికి వెళ్తానన్న నటి
దీంతో ఆమె స్పందిస్తూ.. 'రాజారాణి' సినిమాలో తాను మందు తాగినట్లు చూపించారని తెలిపింది. అయితే, తాను మందు తాగలేదని, తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమేనని స్పష్టం చేసింది. తాను ఎక్కువగా పార్టీలు చేసుకోనని, అయితే, వీకెండ్లలో తన స్నేహితుల్ని కలిసి వాళ్లతో భోజనానికి వెళ్తానని తెలిపింది. అలాగే, లాంగ్ డ్రైవ్స్ లేదా కాఫీ తాగడానికి వెళ్తానని చెప్పింది. ఆమె క్రెడిట్ కార్డు నంబర్, దాని సీవీవీ నంబర్ చెప్పాలని ఓ అభిమాని అడగగా అది మీకు ఎందుకు? అంటూ ధన్య జవాబు ఇచ్చింది.