Daggubati Purandeswari: న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన వైసీపీ నేతలను ఎంతమందిని అరెస్ట్ చేశారు?: పురందేశ్వరి 

Purandeswari condemns Raghurama Krishna Raju arrest
  • రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
  • హైదరాబాదులో అరెస్ట్ చేసి ఏపీకి తరలింపు
  • రాజకీయ ప్రకంపనలు రేపిన తాజా పరిణామం
  • అరెస్ట్ ను ఖండించిన పురందేశ్వరి
వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాదులోని ఆయన నివాసంలో అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీలకు అతీతంగా రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను ఖండిస్తున్నారు. బీజేపీ మహిళా నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఈ అంశంలో స్పందించారు. రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను ఖండిస్తున్నట్టు తెలిపారు.

"రాష్ట్ర ప్రభుత్వ పరువుకు భంగం కలిగేలా ప్రసంగించారన్న ఆరోపణలపై రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారు... ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాత్రమే కాదు, న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన అదే పార్టీకి చెందిన నేతలను ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది" అని  పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

గత కొంతకాలంగా రఘురామకృష్ణరాజుకు, వైసీపీ పెద్దలకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఆ యుద్ధం మరింత ముదిరింది. తాజా అరెస్టుతో అది పరాకాష్ఠకు చేరింది.
Daggubati Purandeswari
Raghu Rama Krishna Raju
Arrest
YSRCP
Andhra Pradesh

More Telugu News