తమన్నాను తీసుకోలేదని తప్పుకున్న హీరో!

Simbu remembers about the Ko movie
  • తమిళంలో హిట్ కొట్టిన 'కో'
  • తెలుగులో 'రంగం' టైటిల్ తో రిలీజ్
  • ఇక్కడ కూడా భారీ వసూళ్లు
  • శింబూ ప్లేస్ లో వచ్చిన జీవా
కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆలస్యంగా వెలుగు చూస్తుంటాయి. అవి సినిమాలకి సంబంధించినవే అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాంటి విషయం ఒకటి తాజాగా బయటికి వచ్చింది. కేవీ ఆనంద్ దర్శకత్వంలో తమిళంలో 'కో' అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. 2011లో కోలీవుడ్లో విడుదలైన ఈ సినిమా, అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత తెలుగులో 'రంగం' పేరుతో విడుదలై ఇక్కడ కూడా భారీ వసూళ్లను సాధించింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుంటే ఎవరూ మిస్ కారు.

ఈ సినిమాలో హీరోగా ముందుగా శింబూను అనుకున్నారట. అయితే కార్తీక హీరోయిన్ అయితే తాను చేయననీ, తమన్నాను తీసుకోమని శింబూ చెప్పాడట. తమన్నా డేట్స్ దొరకడం కష్టంగా ఉందనీ, అయినా ఆమె పారితోషికం చాలా ఎక్కువని నిర్మాతలు అయిష్టతను వ్యక్తం చేశారట. దాంతో శింబూనే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. ఆ తరువాత హీరోగా జీవాను తీసుకోవడం జరిగిందన్న మాట. శింబూతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్న సమయంలోనే, దర్శకుడు కేవీ ఆనంద్ చనిపోవడం జరిగిందని అంటున్నారు.
Go Back to Shorts
Simbu
K.V.Anand
Jeeva
Karthika

More Telugu News