Trivendra Singh Rawat: కరోనా వైరస్ కూడా మనుషుల్లాంటి జీవే: ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్

Trivendra Singh Rawat says corona virus has the right to live
  • కరోనా వైరస్ పై త్రివేంద్ర సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • కరోనాకు బతికే హక్కు ఉందని ఉద్ఘాటన
  • మనుగడ కోసం రూపాలు మార్చుతోందని వెల్లడి
  • బతకడానికి ప్రయత్నిస్తోందని వివరణ
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా వైరస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కూడా మనుషుల్లాంటి జీవేనని అన్నారు. మనలాగే కరోనా కూడా బ్రతకడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. తన మనుగడ కోసమే వైరస్ రూపాన్ని మార్చుతోందని వివరించారు. మనందరిలాగే కరోనా వైరస్ కు జీవించే హక్కు ఉందని త్రివేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. త్రివేంద్ర సింగ్ రావత్ గత మార్చిలో సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ బీజేపీ నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఉత్తరాఖండ్ సీఎంగా తీర్థ్ సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టారు.
Trivendra Singh Rawat
Corona Virus
Humans
Uttarakhand
India

More Telugu News