Sunil Gavaskar: భారత క్రికెట్ జట్టుకు కాబోయే కెప్టెన్ ఇతనే: సునీల్ గవాస్కర్

Rishabh Pant may be Team India future captain says Sunil Gavaskar
  • భారత్ కు కాబోయే కెప్టెన్ రిషభ్ పంత్
  • గెలవాలనే కసి అతనిలో ఉంది
  • ప్రత్యర్థుల కంటే పంత్ ముందున్నాడు
టీమిండియాకు భవిష్యత్తు సారధి రిషభ్ పంత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును పంత్ అద్భుతంగా నడిపించాడని కితాబునిచ్చారు. నేర్చుకోవాలనే తపన, గెలవాలనే కసి అతనిలో కనిపించాయని చెప్పారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు 8 మ్యాచులు ఆడగా.. 6 మ్యాచుల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో పంత్ నాయకత్వం క్రీడా విశ్లేషకులను ఆకర్షిస్తోంది.

తాజాగా గవాస్కర్ మాట్లాడుతూ, ప్రతి కెప్టెన్ తప్పులు చేస్తుంటాడని... కానీ, తప్పుల నుంచి నేర్చుకునే గుణం పంత్ లో ఉందని అన్నారు. పొరపాట్లను సరిదిద్దుకుని, మళ్లీ గాడిలో పడే గుణం పంత్ లో ఉందని కితాబునిచ్చారు. చాలా సందర్భాల్లో ప్రత్యర్థుల కంటే పంత్ ముందున్నాడని చెప్పారు. టీమిండియా పగ్గాలు చేపట్టబోయే వ్యక్తుల్లో పంత్ ఒకడని అన్నారు.
Sunil Gavaskar
Rishabh pant
Team India

More Telugu News