Tamil Nadu: తమిళనాడు మంత్రుల్లో అందరికన్నా సంపన్నుడు గాంధీ

MR Gandhi is richest minister in Tamil Nadu
  • ఎంఆర్ గాంధీ ఆస్తుల విలువ రూ. 47.94 కోట్లు
  • అప్పులు ఎక్కువున్న మంత్రి కూడా గాంధీనే
  • కేబినెట్ లో అందరికంటే పేద మంత్రి తంగరాజ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. స్టాలిన్ నేతృత్వంలో కేబినెట్ కూడా కొలువుదీరింది. అయితే స్టాలిన్ కేబినెట్ లో అందరి కంటే సంపన్నుడిగా ఎంఆర్ గాంధీ నిలిచారు. రాణిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. చేనేత, జౌళి, ఖాదీ, గ్రామ పరిశ్రమల బోర్డు మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.

ఎన్నికల అఫిడవిట్ లో గాంధీ తన ఆస్తుల విలువను రూ. 47.94 కోట్లుగా పేర్కొన్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, గాంధీ కేవలం సంపన్నుడే కాదు... ఎక్కువ అప్పులు ఉన్నది కూడా ఆయనకే. తనకు రూ. 14.46 కోట్ల అప్పులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు కేబినెట్ లో తంగరాజ్ అందరికంటే పేదవాడిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ. 23.39 లక్షలు మాత్రమే. తంగరాజ్ మినహా మంత్రులందరూ కోటీశ్వరులే కావడం గమనార్హం.
Tamil Nadu
DMK
Cabinet
Richest Minister

More Telugu News