Jagan: ఒక్క‌ బటన్‌ నొక్కి 52.38 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,928.88 కోట్లు జమ చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్

  • ఈ ఏడాదికి వైఎస్సాఆర్‌ రైతు భరోసా ప‌థ‌క‌ తొలి విడత సాయం విడుదల
  • అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతలుగా రూ.13,500 సాయం
  • ఖరీఫ్‌కు ముందు మొదటి విడత కింద రూ.7,500 సాయం
jagan releases raithu barosa funds

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈ ఏడాదికి వైఎస్సాఆర్‌ రైతు భరోసా ప‌థ‌క‌ తొలి విడత సాయం విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం జగన్  కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ..  52.38 లక్షల మంది రైతులకు రూ.3,928.88 కోట్ల సాయం పంపామ‌ని చెప్పారు. రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులూ రాకూడ‌ద‌నే అర‌కోటి మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూర్చుతున్న‌ట్లు వివ‌రించారు.  

రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని కొన‌సాగిస్తున్నామ‌న్నారు. అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతలుగా రూ.13,500 సాయం అందజేస్తున్నామని వివ‌రించారు. ఖరీఫ్‌కు ముందు మొదటి విడత కింద రూ.7,500 సాయం అందిస్తున్నామని చెప్పారు. క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలోనూ రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నామని వివ‌రించారు. రైతు భరోసా కింద ఈ ఏడాది 52,38,517 రైతుల‌ కుటుంబాలు అర్హత పొందాయ‌ని చెప్పారు.  

More Telugu News