Chundur: కానిస్టేబుల్‌తో కలిసి ఆత్మహత్యకు యత్నించిన చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి

Chundur SI Sravani died in a hospital while treatment
  • గతేడాది అక్టోబరులో చుండూరు ఎస్ఐగా శ్రావణి బాధ్యతలు
  • కానిస్టేబుల్ రవీంద్రతో కలిసి గత శనివారం ఆత్మహత్యాయత్నం
  • రవీంద్రకు కొనసాగుతున్న చికిత్స
కానిస్టేబుల్‌తో కలిసి గత శనివారం ఆత్మహత్యకు యత్నించిన గుంటూరు జిల్లా చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి (35) మృతి చెందారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన శ్రావణి తొలుత కొంతకాలంపాటు నరసరావుపేటలోని దిశ పోలీస్ స్టేషన్‌లో పనిచేశారు. గతేడాది అక్టోబరులో చుండూరు ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రవీంద్రతో ఆమె సన్నిహితంగా మెలిగేవారు.

 ఈ క్రమంలో గత శనివారం ఇద్దరూ కలసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అనంతరం వారిద్దరూ స్వయంగా కారులో వెళ్లి తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని వేర్వేరు ఆసుపత్రులకు వారిని తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న శ్రావణి పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున మృతి చెందారు. కానిస్టేబుల్ రవీంద్రకు చికిత్స కొనసాగుతోంది.
Chundur
Guntur District
SI Sravani

More Telugu News