చారిత్రక చిత్రంగా 'మరక్కర్' .. సంగీత కళాకారిణిగా కీర్తి సురేశ్!
- 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా
- 'మలబార్' ప్రాంతాన్ని రక్షించే 'కుంజలి మరక్కర్'
- యుద్ధ నాయకుడిగా మోహన్ లాల్
- ఆగస్టు 12వ తేదీన విడుదల
ఈ సినిమాలో మోహన్ లాల్ సరసన నాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. దాంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఏమై ఉంటుంది? అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ సంప్రదాయ బద్ధమైన కుటుంబానికి చెందిన సంగీత కళాకారిణిగా కనిపిస్తుందట. కథానాయకుడితో ఆమె ఎలా ప్రేమలో పడుతుంది? ఆయనతో ప్రేమలో పడటం వలన ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ పాత్ర నడుస్తుందని అంటున్నారు. తన కెరియర్లోనే ఈ పాత్ర ప్రత్యేకమని కీర్తి చెబుతుండటం విశేషం.