Andhra Pradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత

AP Former DGP B Prasada Rao died with heart attack
  • అమెరికాలో గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక
  • చికిత్స పొందుతూ కన్నుమూత
  • పలు హోదాల్లో పనిచేసిన ప్రసాదరావు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బి. ప్రసాదరావు గుండె పోటుతో కన్నుమూశారు. కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన నిన్న రాత్రి చాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

1979వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రసాదరావు వయసు 65 సంవత్సరాలు. స్వస్థలం విజయవాడ. కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ ఎస్పీగా పనిచేసిన ప్రసాదరావు.. ఏసీబీ డీఐజీగా, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్‌గానూ సేవలు అందించారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగానూ పనిచేశారు. తను అందించిన సేవలకు గాను 1997లో ఇండియన్ పోలీస్ మెడల్, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకాలను అందుకున్నారు. డీజీపీ వి.దినేశ్ రెడ్డి తర్వాత 30 సెప్టెంబరు 2013లో ఇన్‌చార్జ్ డీజీపీగా ఆయన వ్యవహరించారు. 
Andhra Pradesh
Telangana
B.Prasada Rao
AP DGP

More Telugu News