Haryana: హర్యానాలోని జైలు నుంచి కరోనా సోకిన 13 మంది ఖైదీల పరారీ

13 Covid19 inmates flee Rewari Jail in Haryana
  • రెవారి జైలులో 493 మంది కరోనా రోగులు
  • ఊచలు తొలగించి దుప్పట్లను తాళ్లలా చేసుకుని పరార్
  • రంగంలోకి నాలుగు పోలీసు బృందాలు
  • జైలు అధికారుల నిర్లక్ష్యంపై దర్యాప్తు
కొవిడ్ సోకిన 13 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. హర్యానాలో జరిగిందీ ఘటన. కరోనా సోకిన ఖైదీలను ఉంచేందుకు రెవారి పట్టణంలోని జైలును ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో కరోనా బారినపడిన ఖైదీలను ఇక్కడికి తరలిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 493 మంది ఖైదీలను ఇక్కడికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 13 మంది ఖైదీలు శనివారం రాత్రి ఊచలను తొలగించి బెడ్ షీట్లను తాళ్లలా ఉపయోగించి తప్పించుకుపోయారు.  

దీంతో అప్రమత్తమైన పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే, వారు రాష్ట్రం దాటిపోకుండా సరిహద్దు పోలీసులను అప్రమత్తం చేశారు. తప్పించుకుపోయిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు జైలు అధికారుల నిరక్ష్యంపైనా దర్యాప్తు జరుపుతున్నారు.
Haryana
Jail
Prisioners
COVID19
Rewari

More Telugu News