Mohan Babu: మా అమ్మ గారికి పుట్టుచెవుడు... ఏ కష్టం రాకుండా ఐదుగురు సంతానాన్ని పెంచి పెద్దచేసింది: మోహన్ బాబు

Mohan Babu wishes his mother on Mothers Day
  • నేడు మాతృదినోత్సవం
  • తల్లి లక్ష్మమ్మకు శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు
  • తన తల్లికి ఏమీ వినిపించదని వెల్లడి
  • అయినా తమకు మాటలు, నడకలు నేర్పిందంటూ ట్వీట్
ప్రముఖ నటుడు మోహన్ బాబు మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లి లక్ష్మమ్మను కీర్తించారు. మాతృమూర్తి తన బిడ్డ ఏడుపు విని ఆకలి తీరుస్తుంది అని వెల్లడించారు. కానీ తన తల్లికి పుట్టుచెవుడు అని, తమ మాటలు ఆమెకు వినిపించకపోయినా తమకు మాటలు, నడక నేర్పిందని తెలిపారు. ఏ కష్టం రాకుండా ఐదుగురు సంతానాన్ని పెంచి పెద్ద చేసిందని తన మాతృమూర్తిని కొనియాడారు. ఆ పుణ్యాత్మురాలికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

మోహన్ బాబు... లక్ష్మమ్మ, నారాయణస్వామి దంపతులకు 1952 మార్చి 19న చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాళెంలో జన్మించారు. మోహన్ బాబుకు రంగనాథ్, రామచంద్ర, కృష్ణ, విజయ అనే తోబుట్టువులు ఉన్నారు.
Mohan Babu
Lakshmamma
Mothers Day
Tollywood

More Telugu News