ఏపీలో కరోనా విలయం... ఒక్కరోజులో 96 మంది మృతి
- ఏపీలో కరోనా సెకండ్ వేవ్
- మరింత పెరుగుతున్న మరణాలు
- పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది మృతి
- గత 24 గంటల్లో 20,065 కొత్త కేసులు
- యాక్టివ్ కేసుల సంఖ్య 1,87,392
అదే సమయంలో 19,272 మంది కరోనా నుంచి కోలుకోగా, 96 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది, విశాఖ జిల్లాలో 12 మంది కన్నుమూశారు. ఏపీలో ఇప్పటివరకు 12,65,439 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 10,69,432 మంది కోలుకున్నారు. ఇంకా 1,87,392 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 8,615కి చేరింది.