Vijay Devarakonda: భయపడకండి... జాగ్రత్తగా ఉండండి: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda  talks about precautions to take if you have COVID19 symptoms
  • అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ ఔట్ పేషెంట్ డాక్టర్లు ఉన్నారు
  • చిన్న లక్షణం కనిపించినా కరోనాగానే భావించండి
  • ముందస్తు చర్యగా అందరికీ దూరంగా ఉండండి
కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే ఎవరికి వారు ఇతరులకు దూరంగా ఉండాలని సినీ హీరో విజయ్ దేవరకొండ కోరాడు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కోవిడ్ ఔట్ పేషెంట్ డాక్టర్లు ఉన్నారని... వారిని వెంటనే సంప్రదించాలని సూచించాడు. ఈమేరకు ట్విట్టర్ ద్వారా విజయ్ ఒక వీడియోను పోస్ట్ చేశాడు.  

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆరోగ్య కేంద్రంలో, ఏరియా హస్పిటల్స్ లో, ఫస్ట్ ఎయిడ్ దవాఖానల్లో కోవిడ్ ఔట్ పేషెంట్ డాక్టర్లను పెట్టిందని విజయ్ చెప్పాడు. కరోనాకు సంబంధించి సమస్యలు, అనుమానాలు ఉన్నవారు డాక్టర్లతో మాట్లాడవచ్చని తెలిపాడు. కరోనా టెస్టులు చేయించుకున్నవారు రిపోర్టుల కోసం టైమ్ వేస్ట్ చేసుకోవద్దని... ప్రస్తుత పరిస్థితుల్లో సమయం చాలా విలువైనదని చెప్పాడు.

 ఎవరికైనా ఏ చిన్న లక్షణం కనిపించినా దాన్ని కరోనాగానే భావించి, ముందస్తు చర్యగా అందరికీ దూరంగా ఉండాలని కోరాడు. ట్రీట్మెంట్ ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిదని చెప్పాడు. చికిత్స చాలా చిన్నదని... ఏ ప్రభుత్వ హెల్త్ సెంటర్ కు వెళ్లినా ట్యాబ్లెట్లు ఇస్తారని, ఒక కిట్ రూపంలో అందిస్తారని చెప్పాడు. 'భయపడకండి... జాగ్రత్తగా ఉండండి' అని కోరాడు.
Vijay Devarakonda
Tollywood
Corona Virus
Telangana

More Telugu News