Charmi: పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరోయిన్ ఛార్మి?

Actress Charmi to get marriage
  • బంధువును పెళ్లాడబోతున్నట్టు వార్తలు
  • పెళ్లిపై నమ్మకం లేదని గతంలో చెప్పిన ఛార్మి
  • ఇప్పటికే మూడు పదుల వయసు దాటిన ముద్దుగుమ్మ
టాలీవుడ్ ముద్దుగుమ్మ ఛార్మి సినీ రంగంలోకి అడుగుపెట్టి 19 ఏళ్లు గడుస్తోంది. టీనేజ్ వయసులో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ పంజాబీ భామ... తన అందచందాలతో కుర్రకారును ఉర్రూతలూగించింది. తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా చెలామణి అయింది. ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న ఆమె... దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. పూరీకి సహ నిర్మాతగా ఉంటూ, ప్రొడక్షన్ పనులను ఆమె పర్యవేక్షిస్తోంది. ఛార్మికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె పెళ్లిపీటలు ఎక్కబోతోందనేదే ఆ వార్త.

తన సమీప బంధువును ఛార్మి పెళ్లాడబోతోందట. పెళ్లికి ఛార్మి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మూడు పదుల వయసు దాటినా పెళ్లి చేసుకోవడానికి ఇన్నాళ్లూ ఛార్మి ఇష్టపడని సంగతి తెలిసిందే. తనకు ఎలాంటి తోడు అవసరం లేదని... పెళ్లిపై తనకు నమ్మకం లేదని ఆమె గతంలో పలు మార్లు వ్యాఖ్యానించింది.

అయితే, ఇప్పుడు సడన్ గా పెళ్లికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు అనుష్క, త్రిష వంటివారు నాలుగు పదుల వయసులో ఉన్నారు. వీరి పెళ్లిళ్లకు సంబంధించి అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తున్నా... ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Charmi
Tollywood
Marriage

More Telugu News