Andhra Pradesh: ‘అమరరాజా’కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన ప్రభుత్వం

  • ఈ నెల 1న అమరరాజా యూనిట్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఏపీఎస్పీడీసీఎల్
  • హైకోర్టు ఆదేశాలతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
  • ప్రారంభమైన ఉత్పత్తి
Government restores power supply to Amar Raja

నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఇటీవల అమరరాజా బ్యాటరీస్ సంస్థకు ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు (ఏపీపీసీబీ) మూసివేత ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 1న కరకంబాడితోపాటు చిత్తూరు సమీపంలోని నూనెగుండ్లపల్లి వద్ద ఉన్న అమరరాజా పరిశ్రమలకు  ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఫలితంగా ఉత్పత్తి నిలిచిపోయింది.

దీనిపై సంస్థ యజమానులైన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.  విచారణ చేపట్టిన హైకోర్టు.. కాలుష్య నియంత్రణ బోర్డు ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలను ఇచ్చింది. నిలిపివేసిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలతో ఎపీఎస్పీడీసీఎల్ సంస్థ నిన్న అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించింది. దీంతో పరిశ్రమల్లో తిరిగి ఉత్పత్తి ప్రారంభమైంది.

More Telugu News