తమిళనాట స్టాలిన్ క్యాబినెట్లో గాంధీ, నెహ్రూ!
- రాణిపేట్ నుంచి గెలిచిన ఆర్.గాంధీ
- ఖాదీ, గ్రామీణ మంత్రిగా క్యాబినెట్లో చోటు
- తిరుచ్చిలో ఎదురులేని కేఎన్ నెహ్రూ
- పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు
రాణిపేట్ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్.గాంధీకి తమిళనాడు కొత్త మంత్రివర్గంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రిత్వ శాఖ లభించింది. అదే సమయంలో, తిరుచ్చి నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన కేఎన్ నెహ్రూను కూడా స్టాలిన్ క్యాబినెట్లోకి ఆహ్వానం పలికారు. నెహ్రూకు పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. కాగా, ఈ తమిళనాడు గాంధీ, నెహ్రూలపై గతంలో తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి.