Actress Praneetha: సెలబ్రిటీలందరూ తమ వంతుగా సమాజానికి ఉపయోగపడాలి: హీరోయిన్ ప్రణీత

Actress Praneetha urges celebrities to help the society
  • కరోనా ఫస్ట్ వేవ్ లో అవసరమైనవారికి ఆహారాన్ని అందించిన ప్రణీత
  • ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్న వైనం
  • తన ఛారిటీ ద్వారా సమాజ సేవ చేస్తున్న ప్రణీత
కరోనా కష్టకాలంలో కొందరు సినీ సెలబ్రిటీలు తమ వంతుగా సమాజ సేవ చేస్తున్నారు. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో సాయాన్ని అందిస్తూ... తమ గొప్ప హృదయాన్ని చాటుకుంటున్నారు. అలా ప్రజలకు సహాయసహకారాలను అందిస్తున్న వారిలో హీరోయిన్ ప్రణీత కూడా ఉన్నారు. గత ఏడాది కరోనా సమయంలో కూడా ఆమె తన వంతుగా ఎంతో సాయం చేశారు. కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ తో అవసరమైన వాళ్లకు ఆహారాన్ని అందించారు.

ఇప్పుడు కూడా తన ఛారిటీ ద్వారా పలు కార్యక్రమాలను ప్రణీత చేపట్టారు. ప్రస్తుతం తన సేవా కార్యక్రమాల్లో భాగంగా కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం కంటే ఆక్సిజనే ఎంతో అవసరమని... అందుకే తన ఛారిటీ ద్వారా ఆక్సిజన్ ను అందిస్తున్నట్టు ఆమె తెలిపారు. సినీ సెలబ్రిటీలందరూ తమ వంతుగా సమాజానికి సాయపడాలని కోరారు.
Actress Praneetha
Tollywood
Social Service
Oxygen Cylinders

More Telugu News