Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన స్టాలిన్.. కేబినెట్‌లో కుమారుడికి దక్కని చోటు

DMK Chief Stalin takes oath as Tamil Nadu Chief Minister
  • తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా స్టాలిన్
  • రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమం 
  • మంత్రుల్లో 15 మంది కొత్తవారే
  • కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు స్థానం
తమిళనాడు శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే చీఫ్ స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో 133 స్థానాలను డీఎంకే కైవసం చేసుకుంది. అన్నాడీఎంకే 66, కాంగ్రెస్ 18, పీఎంకే 5, బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి.

 కాగా, కరోనా నేపథ్యంలో స్టాలిన్ ప్రమాణస్వీకారం నిరాడంబరంగా సాగింది. రాజ్‌భవన్‌లో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ స్టాలిన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడుకు స్టాలిన్ 14వ ముఖ్యమంత్రి. స్టాలిన్‌తోపాటు 34 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 19 మంది మాజీ మంత్రులు కాగా, 15 కొత్త ముఖాలు ఉన్నాయి. అలాగే, ఇద్దరు మహిళలకు కూడా స్టాలిన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధికి మాత్రం మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం గమనార్హం.
Tamil Nadu
Stalin
Chief Minister

More Telugu News