Dhulipala Narendra Kumar: క‌రోనా చికిత్స కోసం విజ‌య‌వాడ‌లోని ఆయుష్ ఆసుప‌త్రికి ధూళిపాళ్ల త‌ర‌లింపు

dhulipala shifts hospital
  • ఇటీవ‌లే సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు క‌రోనా
  • జైలులో ఉన్న ధూళిపాళ్ల‌కు కూడా పాజిటివ్
  • కోర్టు ఆదేశాల‌తో చికిత్స
సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడిన‌ ఆరోపణలపై కొన్ని రోజుల క్రితం టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణ, సహకారశాఖ మాజీ అధికారి గురునాథం అరెస్ట‌యిన విష‌యం విదిత‌మే. ఇటీవ‌లే గోపాలకృష్ణకు కరోనా నిర్ధారణ అయింది.

దీంతో రాజ‌మ‌హేంద్ర వ‌రం జైలులో ఉన్న సహకారశాఖ మాజీ అధికారి గురునాథంతో  పాటు ధూళిపాళ్ల నరేంద్రకు కూడా తాజాగా క‌రోనా పరీక్షలు చేయించ‌గా ధూళిపాళ్ల‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ధూళిపాళ్ల‌ను విజయవాడలోని ఆయుష్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వైద్యులు ధూళిపాళ్ల‌కు క‌రోనా చికిత్స అందిస్తున్నారు.
Dhulipala Narendra Kumar
Telugudesam
Corona Virus

More Telugu News