Vijay: విజయ్ సినిమాలో మాలీవుడ్ స్టార్స్

Mollywood stars in Vijay 65th film
  • విజయ్ హీరోగా 65వ సినిమా
  • కథానాయికగా పూజ హెగ్డే
  • జార్జియాలో పూర్తయిన తొలి షెడ్యూల్
  • సెకండ్ షెడ్యూల్ కి సన్నాహాలు    
విజయ్ కథానాయకుడిగా ఆయన 65వ సినిమా రూపొందుతోంది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తమిళంలో నయనతార ప్రధాన పాత్రధారిగా తెరకెక్కించిన 'కొలమావు కోకిల' ఆయనకి మంచి ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. తెలుగులో 'కో కో కోకిల' పేరుతో థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఇక్కడ వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. అందువలన విజయ్ 65వ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ సినిమాలో విజయ్ సరసన నాయికగా పూజ హెగ్డే నటిస్తోంది. ఇక ఒక ముఖ్యమైన పాత్రకిగాను మలయాళ నటి 'అపర్ణ దాస్' ను తీసుకున్నారు. తాజాగా మలయాళం నుంచి మరో నటుడిని ఎంపిక చేసుకున్నారు. అతని పేరు 'షైన్ టామ్ చాకో'. ఇప్పటివరకూ మలయాళంలో మాత్రమే చేస్తూ వచ్చిన ఆయన, తమిళంలో చేస్తున్న మొదటి సినిమా ఇదేనని అంటున్నారు. మలయాళంలోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలనే ఉద్దేశంతోనే అక్కడి ఆర్టిస్టులను ఎక్కువగా తీసుకుంటున్నారట. ఇప్పటికే జార్జియాలో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, కరోనా తరువాత సెకండ్ షెడ్యూల్ కోసం సెట్స్ పైకి వెళ్లనుంది.
Vijay
Pooja Hegde
Aparna Das

More Telugu News