Jagdeep Dhankhar: మమతకు సుతిమెత్తని హెచ్చరికలు చేసిన గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్

Hope CM will restore rule of law Gov Jagdeep Dhankhar
  • నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మమత
  • మమతను సోదరిగా ప్రస్తావిస్తూనే, ఇటీవల హింసపై గవర్నర్ హెచ్చరికలు
  • శాంతిభద్రతలు పునరుద్ధరించాలని కోరిన వైనం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మమత బెనర్జీ నేడు వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ జగదీప్‌ ధన్‌కర్ మమతకు సుతిమెత్తని హెచ్చరికలు చేశారు.

రాష్ట్రంలో టీఎంసీ విజయం తర్వాత జరిగిన హింస గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి మమత తన సోదరిలాంటి వారని, ఆమె మరింతగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. అలాగే, రాష్ట్రంలో శాంతిభద్రతలు పునరుద్ధరించడానికి త్వరితగతిన అన్ని చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపారు. బెంగాల్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత మమతదేనని ధన్‌కర్ పేర్కొన్నారు.
Jagdeep Dhankhar
Mamata Banerjee
West Bengal

More Telugu News