Mahesh Babu: 'సర్కారువారి పాట'కు అలా ప్లాన్ చేశారట!

Sarkaruvari Paata second schedule starts from june
  • మహేశ్ నుంచి నాన్ స్టాప్ ఎంటర్టైనర్
  • తొలిసారిగా ఆయన జోడీగా కీర్తి సురేశ్
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  

మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న 'సర్కారువారి పాట' సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వేలంపాటను ఏం చూస్తాం? అని ప్రేక్షకులు అనుకుంటారేమోనని, ఇది పూర్తిస్థాయి వినోదభరితమైన సినిమా అని పరశురామ్ క్లారిటీ ఇచ్చేశాడు. అప్పటి నుంచి ఈ సినిమా పట్ల అందరూ ఆసక్తిగానే ఉంటున్నారు. రెండో షెడ్యూల్ షూటింగు జరుగుతూ ఉండగా, కరోనా కారణంగా వాయిదా వేశారు. జూన్ నుంచి తిరిగి షూటింగ్ మొదలుపెట్టాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్పటికి కరోనా తగ్గుముఖం పడుతుందనే వాళ్లు భావిస్తున్నారట.

ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఆమె పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ, అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. దుబాయ్ సిటీలో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్స్ .. ఎడారి ప్రాంతంలో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. 'సంక్రాంతి'కి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు .. త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News