Jagan: ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... వ్యాక్సిన్ పై ప్రధానికి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయం

CM Jagan to write PM Modi for corona vaccine
  • సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం
  • మూడు గంటల పాటు భేటీ
  • కరోనా నేపథ్యంలో కీలక అంశాలపై చర్చ
  • సాయంత్రం 4 గంటలకు పేర్ని నాని ప్రెస్ మీట్

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ సచివాలయంలో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీ ముగిసింది.  ఈ మంత్రివర్గ సమావేశం మూడు గంటల పాటు జరిగింది. కరోనా నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించిన క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఈ సాయంత్రం 4 గంటలకు క్యాబినెట్ భేటీ నిర్ణయాలను వెల్లడించనున్నారు.

కాగా, కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలని సీఎం జగన్ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. వ్యాక్సిన్ డోసులు త్వరగా కేటాయించాలని ప్రధానిని కోరనున్నారు. 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News