p.chidambaram: డీఎంకే ప్రభుత్వంలో చేరబోవడం లేదు: కాంగ్రెస్

No we dont want to include DMK Govt
  • కూటమి పార్టీల అవసరం లేకుండానే అధికారంలోకి డీఎంకే
  • మూడొంతుల స్థానాలను కైవసం చేసుకున్న స్టాలిన్ పార్టీ
  • పార్టీలో చేరికపై చిదంబరం స్పష్టీకరణ
తమిళనాడులో డీఎంకే ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో తాము చేరబోవడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమి 157 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఉన్నాయి. డీఎంకే సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేన్ని సీట్లు కైవసం చేసుకుంది. దీంతో డీఎంకే ఏర్పాటు చేసే ప్రభుత్వంలో చేరాలా? వద్దా? అన్నది ఆయా పార్టీల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.  

ఈ నేపథ్యంలో పార్టీలో చేరికపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. డీఎంకే ప్రభుత్వంలో చేరే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డీఎంకే మూడొంతుల మెజారిటీ సాధించిందన్నారు. కాబట్టి ప్రభుత్వంలో చేరే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు.
p.chidambaram
Congress
Tamil Nadu
DMK

More Telugu News