Sabbam Hari: సబ్బం హరి నన్నెంతో అభిమానించేవాడు: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu condolences to the demise of Sabbam Hari
  • కరోనాతో కన్నుమూసిన సబ్బం హరి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు
  • సబ్బం హరి తనకు మంచి మిత్రుడు అని వెల్లడి
  • విశాఖ మేయర్ గా విశేష సేవలందించారని కితాబు
  • ఎంపీగానూ మరువరాని వ్యక్తి అని ప్రశంసలు
అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కరోనాతో ఈ మధ్యాహ్నం మృతి చెందిన సంగతి తెలిసిందే. సబ్బం హరి మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. సబ్బం హరి మృతి తనను తీవ్ర విచారానికి గురిచేసిందన్నారు. ఈ కష్టకాలంలో సబ్బం హరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు వివరించారు. సబ్బం హరి తనకు మంచి మిత్రుడు అని, తనను ఎంతగానో అభిమానించేవారని తెలిపారు. మేయర్ గా పనిచేసిన కాలంలో విశాఖ నగరాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. అటు, అనకాపల్లి ఎంపీగానూ సబ్బం హరి సేవలు మరువలేనివని కీర్తించారు.

ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో సబ్బం హరి విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. గత కొన్నిరోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు.
Sabbam Hari
Venkaiah Naidu
Demise
Corona Pandemic
Andhra Pradesh

More Telugu News