Summer Vacations: ఈ నెల 10 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు

Advanced summer vacations for Supreme Court
  • సుప్రీంకోర్టుకు ముందస్తు సెలవులు
  • షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14 నుంచి సెలవులు
  • కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందన్న బార్ అసోసియేషన్ ప్రతినిధులు
  • ముందస్తు సెలవులు ప్రకటించాలని సీజేఐకి వినతిపత్రం
  • సానుకూలంగా స్పందించిన సీజేఐ
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఈ నెల 10 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 14 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఇవ్వాల్సి ఉంది. అయితే బార్ అసోసియేషన్ వర్గాల విజ్ఞప్తుల మేరకు, ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే సెలవులు ప్రకటించారు.

గత నెల 26న బార్ అసోసియేషన్ ప్రతినిధులు వేసవి సెలవుల అంశంపై సీజేఐకి ఓ వినతి పత్రం అందించారు. ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న కరోనా వ్యాప్తి నేపథ్యంలో సెలవులు ప్రకటించాలని కోరారు. దీనిపై జస్టిస్ ఎన్వీ రమణ సానుకూలంగా స్పందిస్తూ ముందుగానే సెలవులు ప్రకటించారు.
Summer Vacations
Supreme Court
Advanced
CJI
Bar Association
Delhi
Corona Pandemic

More Telugu News