Balakrishna: బాలయ్య కోసం పవర్ఫుల్ కథల వెదుకులాట!

Harika and Hasini creations are waiting for powerful story for Balakrishna
  • ముగింపు దశలో 'అఖండ'
  • నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేనితో
  • లైన్లోనే మరో భారీ ప్రాజెక్ట్    

భారీతనం బాలకృష్ణ సినిమా ప్రధమ లక్షణం .. ఇక అందులో మాస్ అంశాలు పుష్కలంగా ఉండటమనేది ప్రధాన లక్షణం. బాలకృష్ణ సినిమా ఇలా ఉండాలనే కచ్చితమైన అభిప్రాయంతో అభిమానులు ఉంటారు. అందుకు తగినట్టుగానే తన కథలు ఉండేలా బాలకృష్ణ జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ 'అఖండ' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగు జరుపుకుంది. అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా తరువాత బాలకృష్ణ .. దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తరువాత ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టే పనిలో బాలకృష్ణ ఉన్నారని అంటున్నారు. హారిక అండ్ హాసిని వారు ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. ఆల్రెడీ బాలకృష్ణకు అడ్వాన్స్ ఇచ్చిన వారు, ఆయన కోసం పవర్ఫుల్ కథను సిద్ధం చేయమని కొంతమంది దర్శకులతో చెప్పారట. ఎవరి కథ నచ్చితే వాళ్లతో సెట్స్ పైకి వెళతారన్న మాట.

Balakrishna
Boyapati Sreenu
Gopichand Malineni

More Telugu News