Bihar: కరోనాతో మృతి చెందిన బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

Bihar CM Passed Away with covid
  • ఫిబ్రవరి 28న సీఎస్‌గా బాధ్యతలు
  • గత నెల 15న కరోనా సంక్రమణ
  • సీఎం సంతాపం

ఈ ఏడాది ఫిబ్రవరి 28న బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ కుమార్ సింగ్ కరోనా మహమ్మారికి బలయ్యారు.1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ కుమార్ ఆగస్టులో పదవీ విరమణ చేయాల్సి ఉండగా అంతలోనే ఆయన మృతి చెందడంతో విషాదం నెలకొంది.

అరుణ్ కుమార్ గత నెల 15న కరోనా బారినపడ్డారు. దీంతో పాట్నాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మంత్రులు, పలువురు రాజకీయ నాయకులు అరుణ్ కుమార్ మృతికి సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News