ఈటల భూకబ్జాలపై నిగ్గు తేల్చాలంటూ విజిలెన్స్ డీజీని ఆదేశించిన సీఎం కేసీఆర్
- మంత్రి ఈటలపై భూ కబ్జా ఆరోపణలు
- వెలుగులోకి తెచ్చిన విశ్రాంత కలెక్టర్
- అధికారులకు ఫిర్యాదు చేసిన రైతులు
- తీవ్రంగా పరిగణిస్తున్న సీఎం కేసీఆర్
- మరికాసేపట్లో మీడియా ముందుకు ఈటల
కాగా, తన క్యాబినెట్లోని ముఖ్యమైన పోర్ట్ ఫోలియో చూస్తున్న ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావడంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చాలంటూ విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా, తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు మంత్రి ఈటల మరికాసేపట్లో మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది.