Rajasthan Royals: కరోనా వేళ రూ. 7.5 కోట్ల విరాళం ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్
- కరోనా బారినపడిన వారికి తక్షణ సాయంగా ఉపయోగపడుతుందని ఆశాభావం
- రాజస్థాన్‌పై దృష్టి సారించామన్న ఫ్రాంచైజీ
- నిధుల సేకరణలో ఆటగాళ్ల పాత్ర ఉందన్న యాజమాన్యం
కరోనా మహమ్మారి చేతుల్లో చిక్కుకుని దేశం అల్లాడిపోతున్న వేళ బాధితులను ఆదుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ భారీ విరాళం ప్రకటించింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు, సెకండ్ వేవ్‌లో వైరస్‌కు చిక్కిన వారిని ఆదుకునేందుకు 7.5 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించింది. నిధుల సేకరణలో ఆటగాళ్లు తమ వంతు పాత్ర పోషించారని ఆ జట్టు యాజమాన్యం కొనియాడింది.
దేశవ్యాప్తంగా ఆపదలో చిక్కుకున్న వారికి ఈ విరాళం తక్షణ సాయంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా తాము రాజస్థాన్‌పై దృష్టి సారించామని, రంజిత్ బర్తాకుర్ అధ్యక్షతన రాజస్థాన్ రాయల్స్ ఫౌండేషన్ (ఆర్ఆర్ఎఫ్) ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిందని ఆవేదన వ్యక్తం చేసింది.