ఇండియా నుంచి అందరూ తక్షణమే వచ్చేయండి: తన పౌరులకు అమెరికా హెచ్చరిక
- భారత్ లో కరోనా తీవ్రతపై అమెరికా ఆందోళన
- ఇండియాకు ఎవరూ వెళ్లొద్దని సూచన
- వీలైనంత త్వరగా భారత్ నుంచి వచ్చేయడమే సురక్షితమని హెచ్చరిక
లెవెల్-4 ట్రావెల్ అడ్వైజరీ కింద ఇండియాలో ఉన్న తమ పౌరులకు అమెరికా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇండియాకు ఎవరూ వెళ్లవద్దని, అక్కడున్న వారు త్వరగా తిరిగి రావాలని చెప్పింది. భారత్ నుంచి వచ్చేయడమే ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితమని తెలిపింది. ఇండియా నుంచి అమెరికాకు ప్రతిరోజు 14 డైరెక్ట్ విమానాలు ఉన్నాయని... యూరప్ గుండా మరిన్ని విమాన సర్వీసులు ఉన్నాయని చెప్పింది.
ఇప్పటికే ఇండియా నుంచి వచ్చే విమాన రాకపోకలపై పలు దేశాలు నిషేధం విధించాయి. భారత్ నుంచి తిరిగి వస్తున్న తమ పౌరులను ఇంగ్లండ్ ఒక హోటల్ లో క్వారంటైన్ చేస్తోంది.