Vakeel Saab: ఓటీటీలో వచ్చేస్తున్న 'వకీల్ సాబ్'.. డేట్ ఎప్పుడంటే..?

Pawan Kalyans Vakeel Saab releasing on Amazon Prime OTT
  • ఘన విజయం సాధించిన పవన్ తాజా చిత్రం 'వకీల్ సాబ్'
  • రూ. 85 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన వైనం
  • ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్ లో విడుదలకానున్న చిత్రం
పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైనికులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. ఇటీవల విడుదలైన 'వకీల్ సాబ్' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 85 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే, కరోనా కారణంగా థియేటర్లకు వెళ్లేందుకు సినీ అభిమానులు కొంత సంకోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఓటీటీలో సినిమాను విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు నిర్ణయించారు. ఈ నెల 30న అమెజాన్ ప్రైమ్ లో సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

'వకీల్ సాబ్' ఓటీటీలో విడుదల అవుతోందంటూ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. చివరకు అందరి ఆకాంక్ష మేరకు ఓటీటీ ద్వారా విడుదల కాబోతోంది. సినిమా విడుదలైన మూడు వారాలకు ఈ చిత్రం ఓటీటీలో వస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా... వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు.
Vakeel Saab
Tollywood
OTT
Amazon Prime
Pawan Kalyan
Janasena

More Telugu News