andhrajyothi: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు భార్యా వియోగం!

ABN Andhrajyothi MD Radhakrishna Wife Passes Away
  • కన్నుమూసిన వేమూరి కనకదుర్గ
  • గత కొంతకాలంగా అనారోగ్యం
  • నేడు జూబ్లీహిల్స్ లో అంత్యక్రియలు
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి, న్యూస్ చానెల్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ భార్య కనకదుర్గ కన్నుమూశారు. ఆమె వయసు 63 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె, హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతిచెందారు.

ఆమె మరణ వార్తను విన్న పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు రాధాకృష్ణకు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ విషాదకర సమయంలో ఆయన కుటుంబం ధైర్యంగా ఉండాలని సందేశాలు పంపారు.నేటి మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబీకులు వెల్లడించారు.
andhrajyothi
Vemuri Radha Krishna
Wife
Kanakadurga

More Telugu News